మాంసం కూర వండలేదని కొట్టి చంపాడు!

  • తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో ఘటన
  • పూటుగా తాగొచ్చి గొడవ పడిన నిందితుడు
  • హతురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు
పూటుగా మద్యం తాగొచ్చిన ఓ వ్యక్తి మాంసం వండలేదన్న చిన్న కారణంతో ఓ మహిళను కర్రతో కొట్టి హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రంపచోడవరం మండలంలోని సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలంలోని మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తోంది. సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ కూడా అదే తోటలో పనిచేస్తున్నాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు.

శనివారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన వెంకటేశ్.. మాంసం కూర ఎందుకు వండలేదని లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వెంకటేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని లక్ష్మిపై దాడిచేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి నిన్న ఉదయం మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Crime News
East Godavari District
Jaggampet
Andhra Pradesh

More Telugu News